Wednesday, 4 November 2026

అమరవీరుల పోరాట ఫలితమే తెలంగాణ : మందకృష్ణ

కమాన్‌పూర్‌ : ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం అమరవీరుల త్యాగాల ఫలితంగానే ఏర్పడబోతుందని మహాజన సోషలిస్టు పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ అన్నారు. కరీంనగర్‌ జిల్లా కమాన్‌పూర్‌ మండలం రానాపూర్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక తెలంగాణ బిల్లును అసెంబ్లీలో తీర్మానం చేసిపంపాలని తెలిపినప్పటికీ సీఎం కిరన& కుమార్‌రెడ్డి మూజువాణి ఓటుతో నెగ్గించుకుని  బ్రహ్మాస్త్రం తన చేతిలో  ఉందని పేర్కొనడం మూర్ఖత్వమన్నారు. మెజార్టీ ప్రాంతం నుంచి మైనార్టీ ప్రాంతం విడిపోయి  ప్రత్యేక రాష్ట్ర డిమాండ్‌ కోసం ఉద్యమాలు చేసే ఏ రాష్ట్రంలోనైనా మెజార్టీ ప్రాంత ప్రజలు వ్యతిరేకించడం సహజమేనని పేర్కొన్నారు. ఎమ్మార్పీఎస్‌, ఎమ్మెస్సీ నాయకులు సమావేశంలో పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *