Tuesday, 3 November 2026

ఈ ఆర్‌సీ బహిరంగ విచారణలో ఉద్రిక్తత

హైదరాబాద్‌ : విద్యుత్‌ ఛార్జల పెంపుపై ఫ్యాప్సి భవన్‌లో నిర్వహించిన ఈఆర్‌సీ బహిరంగ విచారణ ఉద్రిక్తంగా మారింది. వామపక్ష పార్టీల నాయకులు, కార్యకర్తలను భద్రతాసిబ్బంది లోనికి అనుమతించలేదు. దీంతో వివిధ పార్టీల నాయకులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఫ్యాప్సి భవన్‌ ఎదుట ఆందోళనకు దిగిన సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి రాఘవులతో సహా పలువురు వామపక్ష నేతలు, కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *