న్యూఢిల్లీ, ఫిబ్రవరి 4 :కాంగ్రెస్ ఆరాటమే సర్వత్రా కానవస్తోంది..రాజకీయ లబ్ది కోసమే ఆరాటపడుతున్నారని టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ అన్నారు. ఎపిభవన్ సమీపంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద టీడీపీ సీమాంధ్ర ప్రాంత ప్రజా ప్రతినిధులు మంగళవారం ఉదయం దీక్ష చేపట్టారు. దీక్షలో పాల్గొన్న పలువురు మాట్లాడారు. పయ్యావుల మాట్లాడుతూ దేశంలో ఏ రాష్ట్ర విభజనసమయంలో ఇలాంటి వ్యతిరేకత వ్యక్తం కాలేదు. అసెంబ్లీలో పూర్తిగా చర్చించలేదు. రాష్ట్రానికి వచ్చిన ముసాయిదా బిల్లు ఆద్యంతం తప్పుల తడకగా ఉంది. అయినప్పటికీ విభజన విషయంలో కాంగ్రెస్ పార్టీకి ముందుకురుకుతోంది. అడ్డగోలు విభజనను అడ్డుకోవాలని టీడీపీ అధినేత చంద్రబాబు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నారు. తాము సైతం ఆందోళన నిర్వహిస్తున్నాం. ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ కళ్లు తెరవాలి. ఇరు ప్రాంతాలకు న్యాయం జరగాలి అదే మా మాట అని అన్నారు.




