హైదరాబాద్: విద్యుత్ ఛార్జీల పెంపుపై ఫ్యాప్సి భవన్లో నిర్వహించిన ఈఆర్సీ బహిరంగ విచిరణ ఉద్రిక్తంగా మారింది. వామపక్ష పార్టీల నాయకులు కార్యకర్తలను భత్రతా సిబ్బంది లోనికి అనుమతించలేదు. దీంతో వివిధ పార్టీల నాయకులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఫ్యాప్సి భవన్ ఎదుట ఆందోళనకు దిగిన సీసీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి రాఘవులుతో సహా పలువురు వామపక్ష నేతలు, కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేసి స్టేషన్కు తరలించారు.




