హైదరాబాద్: ఏపీఎన్జీవోలు రేపటినుంచి తల పెట్టిన సమ్మెలో తాము పాల్గొనలేమని సీమాంధ్ర ఆర్టీసీ ఐకాస ప్రకటించింది. తాము సమ్మెలో పాల్గొంటే ప్రైవేటు ఆపరేటర్లు ప్రయాణికులను దోచుకుంటారని పేర్కొంది. త్వరలో ఐకాస సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని సీమాంధ్ర ఆర్టీసీ ఐకాస తెలిపింది.




