ఢిల్లీ : కాంగ్రెస్ వార్‌రూమ్ సమావేశంలో పాల్గొనడానికి తనకు, సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డికి ఆహ్వానం అందలేదని పీసీసీ అధ్యక్షులు బొత్స సత్యనారాయణ తెలిపారు. రాజ్యాంగబద్ధంగా ప్రక్రియ జరపాలన్న డిమాండ్‌తోనే రేపు నిరసన దీక్ష చేస్తున్నామని, రాజ్యంగాన్ని ఎవరూ చేతుల్లోకి తీసుకోరాదని ఆయన అన్నారు. రాజ్‌ఘాట్ వద్ద నివాళులు అర్పించి తర్వాత జంతర్‌మంతర్ వద్ద దీక్ష చేస్తామని చెప్పారు. అసెంబ్లీలో సీమాంధ్ర ఎమ్మెల్యేలు వ్యవహరించినట్లుగా పార్లమెంటులో ఎంపీలు వారిగా వారి అభిప్రాయాలు చెప్తారని పీసీసీ అధ్యక్షులు పేర్కొన్నారు.




