ఢిల్లీ: రాష్ట్ర విభజన వల్ల ఏ ప్రాంతానికి అన్యాయం జరగకుండా చూస్తామని ఇరుప్రాంత ఎంపీలకు తెలిపినట్టు రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జీ దిగ్విజయ్‌సింగ్ తెలిపారు. కాంగ్రెస్ వార్‌రూం సమావేశం అనంతరం మీడియాతో ఆయన మాట్లాడుతూ ఇరు ప్రాంత నేతలతో మాట్లాడాం. సహద్భావ వాతావరణంలో చర్చలు జరిగాయి. అభ్యంతరాలు ఉంటే చెప్పాలని కోరాం. ఇరుప్రాంతాల నేతలు తమతమ వాదనలు వినిపించారు.




