
టీ జేఏసీ చైర్మన్ కోదండరామ్
హైదరాబాద్, ఫిబ్రవరి 4 (జనంసాక్షి) :
ఉద్యమ శక్తులు ఏకమై కుట్రను తిప్పికొడదామని టీ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్ పిలుపునిచ్చారు. అందరి మద్దతుతో పార్లమెంటులో తెలంగాణ బిల్లును ఆమోదింపజేసుకుంటమని కోదండరామ్ తెలిపారు. మంగళవారం నగరంలో నిర్వహించిన జేఏసీ స్టీరింగ్ కమిటీ సమావేశం ముగిసిన అనంతంరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఉద్యమశక్తులమంతా ఐక్యంగా ఉన్నాం. ఇందులో ఎవరికీ ఎలాంటి అనుమానాలు లేవన్నారు. బిజెపి నేత . సుష్మాస్వరాజ్ వ్యాఖ్యలను కొందరు వక్రీకరించారు. టీ బిల్లుకు మద్దతు ఉంటుందని బీజేపీ స్పష్టంగా చెప్పిందని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తుది దశలో ఉన్నందున సీమాంధ్ర నేతలు సృష్టిస్తున్న అడ్డంకులను కలిసికట్టుగా ఉంటూ భగ్నం చేయాలని తెలిపారు. టీ బిల్లు పార్లమెంట్‌లో ప్రవేశప్టెనున్న నేపథ్యంలో బీజేపీ పాత్రపై పలు వార్తలు వస్తునందున స్పష్టత కోసం టీ జేఏసీ కిషన్‌రెడ్డితో భేటీ అయింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు తమ మద్దతు ఉంటుందని మొదటినుంచి చెబుతున్నామని, మాట తప్పేది లేదని కిషన్‌రెడ్డి స్పష్టం చేసిన విషయం తెలిసిందే. ఇదిలావుంటే తాను చెప్పినట్లు తెలంగాణ రాష్ట్రంలోనే అడుగు పెడతానని టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ మరోసారి స్ఫష్టం చేశారు. ఇవాళ ఢిల్లీలో ఆయన ప్రధాని మన్మోహన్‌సింగ్‌ను కలిశారు. ఈ విషయలు కూడా వీరి చర్చలో వచ్చాయి. ప్రధాని విలేకర్లతోనూ, కేసీఆర్‌తోనూ స్పష్టత ఇచ్చారని అన్నారు. ఈ సమావేశాల్లోనే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు బిల్లును ఆమోదింపజేసేందుకు కేంద్రం అన్ని విధాలా ఏర్పాట్లు చేసిందని, తప్పకుండా తెలంగాణ ప్రజల కల సాకారమవుతుందని ప్రధాని కేసీఆర్ తో వెల్లడించారు.
ఉద్యమ శక్తులు ఏకమై కుట్రను తిప్పికొడదాం




