Tuesday, 3 November 2026

ఇరు ప్రాంతాలను ఒప్పించాం

బిల్లు గెలిపిస్తాం : దిగ్విజయ్‌
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 4 (జనంసాక్షి) :
ఆంధ్రప్రదేశ్‌ పునర్‌వ్యవస్థీకరణ బిల్లుకు సంబంధించి రాష్ట్రంలోని ఇరు ప్రాంతాల ఎంపీలను ఒప్పించామని కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్‌సింగ్‌ అన్నారు. తెలంగాణ ఏర్పాటుపై మంగళవారం రాత్రి నిర్వహించిన వార్‌ రూమ్‌ భేటీలో కాంగ్రెస్‌ ఎంపీల నుంచి అభిప్రాయాలు తీసుకున్నట్లు తెలిపారు. వార్‌రూమ్‌ సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ, సీమాంధ్ర ప్రాంతాలకు లబ్ధి చేకూర్చేలా బిల్లు వుంటుందని ఆయన వెల్లడించారు. ఇరు ప్రాంతాల ప్రజల మనసును దోచుకుంటామని ఆయన అన్నారు. పార్లమెంట్‌ సమావేశాల్లో సీమాంధ్ర ఎమ్మెల్యేలు అనవసర ఆందోళనలకు లోనుకావాల్సిన అవసరం లేదని, అవశేష ఆంధ్రప్రదేశ్‌ ప్రజల సమస్యల పరిష్కారానికి కేంద్రం కట్టుబడి ఉందని చెప్పారు. సుమారు మూడు గంటల పాటు సాగిన వార్‌ రూమ్‌ సమావేశం నుంచి లగడపాటి రాజగోపాల్‌ అర్ధాంతరంగా వెళ్లిపోయారు. సీమాంధ్ర ఎంపీలు లేవనెత్తిన అంశాలను జీవోఎం దృష్టికి తీసుకెళ్తామని ఆయన చెప్పారు. ఈ పార్లమెంటు సమావేశాల్లోనే తెలంగాణ బిల్లు ప్రవేశపెడితే న్యాయం జరుగుతుందని చెప్పినట్లు కాంగ్రెస్‌ సీనియర్‌ నేత వీహెచ్‌ అన్నారు. వార్‌ రూవమ్‌లో సమావేశం ముగిసిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. బుధవారం తెలంగాణ కాంగ్రెస్‌ ప్రతినిధులు దీక్షలు చేపట్టబోవడం లేదని స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *