ఢిల్లీ:తెలంగాణ బిల్లుపై కాంగ్రెస్ నేతల్లో భిన్నాభిప్రయాలు ఉన్నాయని భాజపా పార్లమెంటరీ పార్టీ నేత సుష్మాస్వరాజ్ ఆరోపించారు. లోక్‌సభలో సుష్మాస్వరాజ్ మాట్డాఉతూ…. కాంగ్రెస్ పార్టీ సీఎం జంతర్‌మంతర్ దీక్ష చేపడుతున్నారని గుర్తు చేశారు. కాంగ్రెస్ సభ్యులే సభలో రెండు రకాలుగా మాట్లాడటమేమిటని నిలదీశారు. నిడోతానియా హత్యోదంతంపై కూడా లోక్‌సభలో సుష్మాస్వరాజ్ మాట్లాడారు. ఢిల్లీలో సామాన్యులకు రక్షణ లేకుండా పోయిందన్నారు. అరుణాచల్ ప్రదేశ్ విద్యార్ధులు కూడా భారతీయులేననని వ్యాఖ్యానించారు. సీమాంధ్ర ఎంపీల సభలో ఆందోళనను ఉధృతం చేయడతో గందరగోళ పరిస్థితి నెలకొంది. దీంతో స్పీకర్ మీరాకుమార్ సభను రేపటికి వాయిదా వేశారు.
కాంగ్రెస్ నేతల్లో భిన్నాభిప్రయాలు : సుష్మాస్వరాజ్





