
కామారెడ్డి : సీఎం కిరణ్ కుమార్ రెడ్డి ఢిల్లీలో చేపట్టిన దీక్ష రాజకీయ డ్రామా అని భాజపా రాష్ర&్ట అధ్యక్షుడు కిషన్ రెడ్డి పేర్కొన్నారు. కామారెడ్డిలో ఆయన మీడియాతో మాట్డాడుతూ సీమాంధ్రలో పబ్బం గడుపుకోవడానికి కుట్రలు, కుతంత్రాలు చేస్తున్నారనాన్నరు. సోనియాగాంధీ అనుకుంటే సీఎంను తొలగించే అవకాశం ఉన్నప్పటికీ అలా చేయకుండా కిరణ్‌ను ఆడిస్తున్నారని ఆరోపించారు. రాజకీయాల్లో నైతిక విలువలు అవసరమని ఆయన పేర్కొన్నారు. తెలంగాణకు వ్యతిరేంగా తమ పార్టీ పార్లమెంట్‌లో వ్యవహరిస్తుందని ఇతర పార్టీలు చేసిన ఆరోపణలు అర్థరహితమన్నారు. పార్లమెంట్‌లో తెలంగాణ బిల్లుకు తమ పార్టీ మద్ధతిస్తుందన్నారు.
సీఎం దీక్ష రాజకీయ డ్రామా : కిషన్‌రెడ్డి




