ఢిల్లీ : వాయిదా అనంతరం ప్రారంభమైన రాజ్యసభ కొద్దిసేపటికే మళ్లీ రేపటికి వాయిదా పడింది. మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమై సభలో సీమాంధ్ర సభ్యులు ఆందోళనకు దిగడంతో గందరగోళం నెలకొంది. దీంతో వైస్‌ఛైర్మన్ కురియన్ సభను రేపటికి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. ఇప్పటికే లోక్‌సభకు రేపటికి వాయిదా పడిన విషయం తెలిసిందే.




