Wednesday, 4 November 2026

రాజ్యసభ ఎన్నికలపై డీజీపీతో ఈసీ సమీక్ష

హైదరాబాద్‌ : రాజ్యసభ ఎన్నికలపై డీజీపీ ప్రసాదరావుతో ఎన్నికల ప్రధానకార్యదర్శి భన్వర్‌లాల్‌ సమీక్ష జరిపారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాజ్యసభ ఎన్నికల్లో 276 మందికి ఓటు హక్కు ఉందన్నారు. గుర్తింపు కార్డును పోలింగ్‌ ఏజెంట్‌ చూపించిన తరువాటే ఓటు వేయాలన్నారు. ఎన్నికలు రహస్యపద్ధతిలోనే జరగుతాయన్నారు. ఓటు ఎవరికి వేసేది వెల్లడించకూడదన్నారు. ఒకవేల ఎకరైన వెల్లడిస్తే క్రిమినల్‌ కేసులు నమోదు చేస్తామని ఆయన పేర్కొన్నారు. ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించడంపై డీజీపీ ప్రసాదరావుతో చర్చించామని ఆయన వివరించారు. సాధారణ ఎన్నికల నేపథ్యంలో పోలీసుశాఖలో బదిలీలపై కూడా చర్చించామన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *