ఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి వైఖరిపై అధిష్టానం ఆగ్రహం వ్యక్తం చేస్తోందని, రాజ్యసభ ఎన్నికల తర్వాత ఆయనను రాజీనామా చేయమని సూచించనున్నట్లు ఏఐసీసీ వర్గాలు పేర్కొంటున్నాయి. స్వయంగా ఢిల్లీలో దీక్ష చేయడం పై అధిష్టానం సీఎం పై తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం. తెలంగాణ కాంగ్రెస్ నేతల వద్ద ఇదే విషయం దిగ్విజయ్ సింగ్ ప్రస్తావించినట్లు తెలుస్తోంది. గత కొంత కాలంగా అదిష్టానం పై ముఖ్యమంత్రి ధిక్కారస్వరం విన్పిస్తున్న సంగతి తెలిసిందే. కాంగ్రెస్ నాయకత్వమే సీఎంను ప్రోత్సహిస్తోందని విపక్షాలు ఆరోపించాయి.




