హైదరాబాద్: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మంత్రి పొన్నాల లక్ష్మయ్య మండిపడ్డారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర విభజనకు అనుకూలమని చంద్రబాబు రెండు లేఖలు ఇచ్చాడని తీరా ఇపుడు తెలంగాణను ఏర్పాటు చేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకున్న తర్వాత సమన్యాయం అంటూ పిచ్చోడిలా దేశమంతా తిరుగుతున్నాడని ఆరోపించారు. సీమాంధ్ర నేతలు రాష్ట్ర విభజన తర్వాత హైదరాబాద్‌లో ఆదాయంలో వాటా కోరుతున్నారని విమర్శించారు. తెలంగాణ రాజధాని హైదరాబాద్ ఆదాయాన్ని సీమాంధ్రతో ఎలా పంచుకుంటామని నిలదీశారు.




