Wednesday, 4 November 2026

తెలంగాణ బిల్లు పాస్‌ కావడానికి

కాంగ్రెస్‌, భాజపా బాధ్యత తీసుకోవాలి
టీ జేఏసీ చైర్మన్‌ కోదండరామ్‌
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 6 (జనంసాక్షి) :
పార్లమెంట్‌లో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు బిల్లును పాస్‌ చేయించే బాధ్యత కాంగ్రెస్‌, బీజేపీలేదేనని టీ జేఏసీ ఛైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరామ్‌ అన్నారు. గురువారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ ఎలాంటి ఒత్తిళ్లకు లొంగకుండా బీజేపీ సహకరించాలని ఆయన కోరారు. టీ మంత్రుల పట్ల సీఎం కిరణ్‌ కుమార్‌రెడ్డి నియంతలా వ్యవహరించాడని ఆయన విమర్శించారు. మహిళామంత్రుల విషయంలో కిరణ్‌ వ్వయహరించిన తీరును తప్పుపట్టారు. కనీసం వారిని పలకరించకపోవడం ఆయన ఫ్యూడల్‌ మనస్తత్వానికి నిదర్శనమన్నారు. తాము అందరినీ కలసి తెలంగాణ కోసం మద్దతు కూడగట్టేందుకు ఇక్కడికి వచ్చామన్నారు. అయితే కాంగ్రెస్‌పై తమకు పూర్తి విశ్వాసం ఉందన్నారు. ఇప్పటి వరకు తీసుకుంటున్న చర్యలను, పడుతున్న అడుగులను చూస్తుంటే అనుకున్న మేరకు బిల్లు పాస్‌ కావడం ఖాయమన్నారు. అయితే సీమాంద్ర నేతలు తమప్రాంత అభివృద్దిని కోరుకోవాలే తప్ప హైదరాబాద్‌ యూటీ చేయాలనడం తగదన్నారు. ఇలాంటి ఆలోచనలు, డిమాండ్లతో చిచ్చు పెట్టవద్దన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *