హైదరాబాద్, ఫిబ్రవరి 6 (జనంసాక్షి) :
ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) నాలుగోసారి వాయిదా పడింది. నిరుద్యోగ ఉపాధ్యాయులు నెలల తరబడి నిరీక్షిస్తున్న టెట్ ఈ సారి నిర్వహించి తీరుతామని చెప్పిన మాధ్యమిక విద్యాశాఖ రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా టెట్‌ను వాయిదా వేయాలని నిర్ణయం తీసుకుంది. ఈమేరకు గురువారం సాయంత్రం మాధ్యమిక విద్యాశాఖ మంత్రి పార్థసారథి మీడియాకు వెళ్లడించారు. ఈ నెలాఖరులోగా టెట్ నిర్వహించి తీరుతామన్నారు. తెలంగాణ ఏర్పాటు బిల్లు పార్లమెంట్ వస్తున్న నేపథ్యంలో సీమాంధ్ర ప్రాంతంలో ఉద్యోగులు సమ్మెకు పిలుపునిచ్చారు. దీంతో 13 జిల్లాల్లో టెట్ నిర్వహించలేమని ఆయా జిల్లా విద్యాశాఖ అధికారులు మాధ్యమిక విద్యాశాఖకు స్పష్టం చేశారు. దీంతో ఆదివారం నిర్వహించాల్సిన టెట్ మరోమారు వాయిదా పడింది.




