Wednesday, 4 November 2026

రాజ్యసభ ఎన్నికల్లో విజేతలు

హైదరాబాద్‌: ంాష్ట్రంలోని ఆరు రాజ్యసభ స్థానాలకు ఈ రోజు జరిగిన ఎన్నికల్లో ఓట్ల లెక్కింపు ముగిసింది. ఆరుగురు అభ్యర్థులు ఈ ఎన్నికల్లో విజేతలుగా నిలిచారు. కాంగ్రెస్‌ అభ్యర్థులు కేవీపీ రామచంద్రరావు, టి.సుబ్బిరామిరెడ్డి, ఎం.ఎ.ఖాన్‌, తేదేపా అభ్యర్థులు గరికపాటి మోహన్‌రావు, తోట సీతారామలక్ష్మీ, తెరాస అభ్యర్థి కె.కేశవరావు గెలుపొందారు. ఈ ఎన్నికల్లో మొత్తం 248 మంది సభ్యులు ఓటింగ్‌కు దూరంగా ఉన్నారు. కాంగ్రెస్‌ ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వరావు తిరస్కరణ ఓటును వినియోగించుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *