రాంచీ ఫిబ్రవరి 7 (జనంసాక్షి):
శాసనసభ, పార్లమెంటు ఎన్నికల్లో మహిళలకు తగిన ప్రాతినిధ్యం కల్పించాలని పలువురు గిరిజన మహిళలతో రాహుల్ భేటి అయ్యారు. ఈ సందర్భంగా ఓ మహిళ ఈ వినతిని ఆయన ముందుంచింది. స్త్రీల రక్షణకు క్షేత్రస్థాయి నుంచి చర్యలు చేపట్టాలని మరొకరు సూచించారు. రాహుల్ గాంధీ ప్రధాని కావాలని తామంతా మద్దతు తెలిపినట్లు మరో గిరిజన మహిళ భేటీ అనంతరం విలేకరులకు తెల్లడించింది. గిరిపుత్రులతో కాంగ్రెస్‌కు ఉన్న అనుబంధాన్ని, వారి అభివృధ్దికి పార్టీ చేసిన కృషిని యువనేత గుర్తు చేసినట్లు వారు పేర్కొన్నారు. అయితే ఈ కార్యక్రమానికి మీడియాను అనుమతించలేదు.




