Wednesday, 4 November 2026

సీఎం కుట్రకు మరో బలిదానం

తెలంగాణా రాదేమోనని యువకుడి ఆత్మహత్య
బెల్లంపల్లి, ఫిబ్రవరి 7 (జనంసాక్షి): తెలంగాణ కోసం మరో వ్యక్తి ఆత్మబలిదానం చేసుకున్నాడు. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుపై జరుగుతున్న తీరును టీవీలో చూస్తూ కలత చెందాడు. మనస్తాపంతో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. కాసిపేట మండలం కొనూరుకి చెందిన తోట శ్రీనివాస్‌ (33) అనే వ్యక్తి కిరాణంలోకి పనిచేసే వాడు. ఇటీవల ప్రత్యేక రాష్ట్రం కోసం జరిగిన ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొనేవాడు. ఈ క్రమంలోనే పని కూడా మానేశాడు. ఇటీవల కాంగ్రెస్‌ తెలంగాణ ఏర్పాటు ప్రకటన అనంతరం సీఎం కిరణ్‌ చేస్తున్న కుట్రలను జీర్ణించుకోలేకపోయాడు. అలాగే తెలంగాణ విషయంలో ఉభయ సభల్లో జరుగుతున్న గొడవలను రోజూ టీవీలో చూస్తూ కలత చెందేవాడు. ఎప్పటిలాగే శుక్రవారం టీవీ చూసి బావి దగ్గరికు వెళ్లి జై తెలంగాణ నినాదాలు చేస్తూ బావి తాడును మెడకు చుట్టుకొని బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు వివరించారు. మృతుడికి భార్య సునిత, కొడుకు సాయి, కుమార్తె సిరి ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *