మావోయిస్టు పార్టీ
12న తెలంగాణ బంద్‌కు పిలుపు
హైదరాబాద్, ఫిబ్రవరి 8 (జనంసాక్షి) :
ఆదివాసీలను ముంచే పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని ఆపాలని సీపీఐ మావోయిస్టు పార్టీ హెచ్చరించింది. భద్రాచలం డివిజన్లోని వందలాది ఆదివాసీ గిరిజన గ్రామాల్ని కూల్చేందుకు పాలకులు సాగిస్తున్న కుట్రలను వ్యతిరేకిస్తూ ఈనెల 12న బంద్‌కు పిలుపునిస్తున్నట్లు ఆ పార్టీ నార్త్ తెలంగాణ స్పెషల్ జోనల్ కమిటీ అధికార ప్రతినిధి శనివారం ఈమేరకు పత్రికా కార్యాలయాలకు లేఖ పంపారు. పోలవరం వద్దు ఆంక్షలు లేని తెలంగాణ కావాలి డిమాండ్ చేశారు. ఆదివాసీలను మభ్యపెట్టి వంచించిన రాజకీయ పార్టీలను తన్నితరుమండి అంటూ పిలుపునిచ్చారు. ఆంధ్రదళారి సంపన్న వర్గాలకు, కార్పొరేట్ కారిడార్ కోసం కేంద్రం పన్నిన కుట్రలకు సై అంటున్నా తెలంగాణ పార్టీల ద్రోహులకు వ్యతిరేకంగా పోరాడాలని పిలుపునిచ్చారు. సీమాంధ్ర సంపన్న దళారులకు దన్నుగా నిలబడ్డ బీజేపీని తన్నితరిమేయాలని అన్నారు. జీవోఎం సూచించిన సవరణలకు యూపీఏ-2 కేబినెట్ ఆమోదం తెలపడం తెలంగాణకు గొడ్డలిపెట్టులాంటిదేనని స్పష్టం చేశారు. తెలంగాణ ఇస్తున్నమంటూనే తెలంగాణ ప్రజల భవిష్యత్తుకు తూట్లు పొడిచే కేంద్రం కుట్రలకు నిరసనగా ఫిబ్రవరి 12న తెలంగాణ వ్యాప్తంగా బంద్‌ను పాటించాలని పిలుపునిచ్చారు. 2013 జూన్ 30న 10 జిల్లాలతో కూడిన తెలంగాణ, పదేళ్లు ఉమ్మడి రాజధాని, పోలవరానికి జాతీయహోదాను కల్పిస్తూ సీడబ్ల్యూసీ తీసుకున్న నిర్ణయాన్ని ప్రపంచబ్యాంక్ మార్కెట్లో ప్రవేశపెట్టే ప్యాకేజీ ప్రతిపాదనవంటిదేనని మేం స్పష్టం చేశాం. బడాపెట్టుబడిదారులకు, సామ్రాజ్యవాదులకు ఊడిగం చేసే కాంగ్రెస్‌పార్టీ దాని స్వాభావాన్ని కేబినెట్ ఆమోదంతో మరోసారి స్పష్టం చేసింది. ఆంధ్రదళారి సంపన్న వర్గాలకు, కార్పొరేట్ పరిశ్రమల కారిడార్ కోసం, డెల్టా ధనిక రైతాంగానికి లబ్ది చేసేందుకే పోలవరం ప్రాజెక్టు, దీంట్లో మునిగిపోతున్న మౌళికవర్గమైన ఆదివాసులు కనుక ఆదివాసుల విశ్వాసాన్ని చూరగొనడం మాత్రమేకాదు,వాళ్లకు ప్రజాస్వామిక న్యాయం జరగడానికి నిర్ధ్వందంగా, రాజీలు, శశబిషలు లేకుండా పోలవరం ప్రాజెక్టును తెలంగాణ ప్రాంత ప్రజలే కాదు, రాయలసీమ ,ఆంధ్ర ప్రజలు వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు. పెద్ద ప్రాజెక్టులు పెద్దల కోసమేనన్న విషయం మరువద్దు. కేబినేట్ తాజా ఆమోదంతో పోలవరం నిర్మానమైతే 304 గ్రామాలు ముంపునకు గురవుతాయి. ఇరువైపుల మాత్రమే కాదు ఒరిస్సా, ఛత్తీస్‌గఢ్‌లలో కూడా ఆదివాసులు నిర్వాసితులు అవుతారు. ఒరిస్సా, ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వాలు వ్యతిరేకిస్తున్న పోలవరంకు జాతీయ ప్రాజెక్టుగా చేపట్టే ప్యాకేజీని తెలంగాణ రాష్ట్రమనే చిరకాల పోరాట ఆకాంక్షకు పోటీగా పెట్టడమే ఒక పెద్ద కుట్ర అని ఆయన స్పష్టం చేశారు. కార్పొరేట్ శక్తుల కోసం కాకినాడ నుంచి విశాఖపట్నం వరకు పారిశ్రామిక కారిడార్, పర్యాటక కారిడార్ నిర్మాణం చేయడం కోసం 23 కంపెనీలతో చేసుకున్న ఒప్పందాలకు నీళ్లు అందించడానికి కేంద్రం దీన్ని జాతీయ స్ధాయిలో చేపట్టడానికి పూనుకుంది. దానికి కార్పొరేట్ శక్తులు, ఆంధ్ర సంపన్న వర్గాలు తమ పథకంలో భాగంగా బీజేపీతో జీవోఎంకు సవరణల రూపంలో సూచించడం, దానికి కేబీనెట్ ఆమోదించడం జరిగిపోయింది. ఈ మూడు రాష్ట్రాల ఆదివాసిల నిర్వాసితులవుతున్నా లక్ష్యపెట్టడం లేదు. తెలంగాణ ప్రజల రాష్ట్ర ఆకాంక్షకుపోటీగా డెల్టాలో భూవసతి గలవారికి మూడోపంటను గ్యారంటీ చేయడానికి వీలుగా పోలవరం ముంపుగ్రామాలు అవశేష ఆంధ్రప్రదేశ్‌లో కలపడం జరుగుతోంది. భద్రాచలం తెలంగాణలోనే అంటూ తెలంగాణ మైదాన ప్రాంత ప్రజలను మానసికంగా అంగీకరించే కుట్రకు దళారి కేంద్రం ముందుకువస్తుంది. 29వ రాష్ట్ర ఏర్పాటు వంటి కీలకమైన నిర్ణయానికి ఎంత ప్రాముఖ్యం ఉన్నదో దానికి పోటీగా ఒక ప్యాకేజీలో భాగంగా పోలవరంను అంశంగా చేర్చి ప్రజాస్వామికవాదుల ముందు తెలంగాణను ఎంచుకోవడం, పోలవరంను ఎంచుకోవడమా వంటి ఒక చిక్కుసమస్యను ముందు పెడుతుందని ఆక్షేపించారు. అనేక దశాబ్దాలుగా దోపిడి, పీడన, అణచివేతను అనుభవిస్తున్న తెలంగాణ ప్రజలు ఈ నిర్ణయం ద్వారా మరింత దుర్బిక్షమైన పరిస్థితులు ఎదుర్కొనే ప్రమాదం పొంచి ఉందన్నారు. 1948 నుంచి తెలంగాణ ప్రజల విషయంలో నెహ్రూ, 69 నుండి ఇందిరాగాంధీ, 2004 నుంచి సోనియాగాంధీ వైఖరులు, వాళ్లకు ఆయా కాలాల్లో కేంద్రప్రభుత్వం మీద ఉన్న సంపూర్ణ అధికారం వల్ల ఉన్న పట్టు ఎంత ద్రోహపూరితమమైనదో తెలంగాణ ప్రజల దృష్టికి కొత్తగా తేవాల్సిన అవసరం లేదు. 10 జిల్లాల, హైదరాబాద్‌తో కూడిన తెలంగాణ అని సీడబ్ల్యూసీ ద్వారా చెప్పి జీవోఎం సవరణల పేరుతో పోలవరాన్ని ప్రధానం చేసి ముంపు గ్రామాలు అవశేష ఆంధ్రప్రదేశ్‌కు కేబినెట్ ఆమోదం తెలిపి మాటమార్చింది. ఇది రేపు ఆదివాసీల పోరాటగొంతుకు నైతిక మద్దతు అందకుండ ఉండేందుకు కేంద్రమంత్రి జైరాంరమేష్ పన్నిన పథకమనేది స్పష్టంగా అర్ధమౌతున్నదన్నారు. ఈ విషయంలో ఇప్పటికే బూర్జువా రాజకీయ పార్టీలన్నీ పోలవరం ప్యాకేజీకి ఆమోదాన్ని ప్రకటితంగానో అప్రకటితంగానో తెలిపే ఉన్నాయి. టీడీపీ సరేసరి మొదటి నుంచి పోలవరం డిమాండ్‌ను పెడుతూనే ఉంది. తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ కూడా పోలవరం ప్రాజెక్టుకు వ్యతిరేకం కాదు. ఒక ఓటు రెండు రాష్ట్రాలని ప్రజలను మోసం చేసిన బీజేపీ ఇప్పుడు తన ద్రోహచరిత్రను పునరావృతం చేస్తోంది. మళ్లీ మేం అధికారంలోకి వస్తే 100 రోజుల్లో తెలంగాణ ఇస్తామని చెప్పి ఆపార్టీ ఇవాళ ఎందుకు వెనక్కిపోతుందో సామ్రాజ్యవాదుల ప్రయోజనాలకోసం పోలవరం కోసం ముంపుగ్రామాలు ఆంధ్రప్రదేశ్‌కే ప్రతిపాదనతో ముందుకు వచ్చిందో చెప్పాలని నిలదీసి తన్నితరమాలని ప్రజలకు పిలుపునిస్తున్నాం. తెలంగాణలో కాంగ్రెస్ నాయకులు సోనియాగాంధీకి గుడులు కట్టి ప్రదక్షణలు చేయడం దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారు. అధికారంలోకి వస్తే గిరిజనులకు 12 శాతం రిజర్వేషన్లు కల్పిస్తానన్న కేసీఆర్ ఇవాళ రెండు లక్షల మంది ఆదివాసులు మునిగిపోతుంటగే ఎందుకు మాట్లాడడంలేదో నిలదీయాలని పిలుపునిస్తున్నాం. ఇది కేవలం ఆదివాసుల సమస్యే కాదు. గోదావరి జలాల మీద ఇందిరానగర్ ప్రాజెక్టు వంటి పెద్ద ప్రాజెక్టు నిర్మాణం అతయిన తర్వాత ఇంక ఎగువన తెలంగాణ ప్రాజెక్టు నిర్మాణం చేసుకోవడానికి అవకాశం ఉండదు. తెలంగాణ ప్రజల చిరకాల వాంచ అయిన ఇచ్చంపల్లి ప్రాజెక్టు చేపట్టడానికి సాంకేతిక, పర్యావరణ నిధుల సమస్యలు కూడా అడ్డువస్తాయి. తెలుగు ప్రజలు ఏ కారణాలతో అల్మట్టి డ్యాం ఎత్తు పెంచడాన్ని బాబ్లి ప్రాజెక్టును వ్యతిరేకించారో అదే ప్రాతిపదికన రేపు ఆంధ్ర ప్రజలు కూడా గోదావరి ఎగువన తెలంగాణ ప్రజలు ప్రాజెక్టులు నిర్మాణం చేసుకోవడాన్ని వ్యతిరేకించే స్థితి వస్తుంది. కనుక ప్రజాస్వామిక శక్తులు, తెలంగాణ ప్రజలు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ఆదివాసీల రక్తపుకూడును తినడం న్యాయామా? ఆలోచించాలి. అందుకే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును, పోలవరం ప్రాజెక్టును ఒక ప్యాకేజీలో బాగంచేసి క్టుట్రను అంగీకరించవద్దు. తెలంగాణ ఇస్తున్నామ్టంటే తెలంగాణ ప్రజల భవిష్యత్ కు తూట్లు పొడిచే కేంద్రం కుట్రలను నిరసనగా ఫిబ్రవరి 12 నతెలంగాణ బంద్‌ను పాటించాలని పిలుపునిస్తున్నాం. ఆకాంక్షలులేని తెలంగాణ కావాలే. పోలవరం ప్రాజెక్టు వద్దు. అనే డిమాండ్‌తో కేంద్రంపై పోరాడాలని పిలుపునిస్తున్నాం. తెలంగాణకు భూమి, భుక్తి విముక్తి, కోసం కమ్యూనిస్టు పార్టీ నాయకత్వంలో సాయుధపోరాటం చేసిన ఉజ్వల చరిత్ర ఉన్నది. తెలంగాణ రాష్ట్ర ఆకాంక్షలో భూమి, నీళ్లు ,కొలువులు ,వనరులపై స్థానిక ప్రజల అధికారం రావాలనే ఆకాంక్ష్య ఉన్నది .స్దానికులే విద్యా, ఉద్యోగాలు అనే న్యాయమైన ఆకాంక్ష్య ఉన్నది ఇటువంటి స్వావలంబన కల్గిన ప్రజాస్వామ్య తెలంగాణ ఏర్పడేంతవరకు ,పోలవరం ప్రాజెక్టు రద్దయ్యేవరకు దళారి పాలకులపై పోరాడాలని పిలుపునిచ్చారు.





