థానె : భాజపా ముఖ్యమంత్రి నరేంద్రమోడీని అసలు తాను కలవనేలేదన్న కేంద్ర మంత్రి శరద్ పవార్ ఇప్పుడు రూటు మార్చారు. కేంద్ర వ్యవసాయ మంత్రి ¬దాలో తాను రాష్ట్రాల ముఖ్యమంత్రులను కలుస్తుంటానని, అందులో తప్పేముందని ఎదురు ప్రశ్నిస్తున్నారు. ఆహారోత్పత్తుల దిగుబడి పెంచడం, ఆహార భద్రతా చట్టం అమలు పరచడం వ్యవసాయ మంత్రిగా తన బాధ్యతలని, వాటి గురించి తాను ఆయా రాష్ట్రాలకు వెళ్లి ముఖ్యమంత్రులతో మాట్లాడతానని పవార్ చెప్పారు. ఒక్క నరేంద్రమోడీని కలవడంపైనే పత్రికలు ఎందుకు హంగామా చేస్తున్నాయో తనకు అర్థం కావడం లేదన్నారు.




