హైదరాబాద్ : రాజ్యసభలో తె.దే.పా. సభ్యులను సస్పెండ్‌చేసి రాష్ట్ర విభజన బిల్లును ఆమోదింపచేసుకోవాలని చూస్తున్నారని తెదేపా ఎంపీ సీఎం రమేశ్ అన్నారు. ఎన్టీఆర్ ట్రస్టు భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ వెల్‌లోకి రాని కాంగ్రెస్ సభ్యులు రేపు తమతో పాటు కలిసిరావాలని సూచించారు. కేంద్రమంత్రులు రాజ్యసభకు వచ్చి సమైక్యవాణి వినిపించాలన్నారు. రాజ్యసభలో బిల్లును ఓడించి తీరతామని రమేశ్ పేర్కొన్నారు.




