న్యూఢిల్లీ : దేశంలోని అన్ని పార్టీల పార్లమెంటు సభ్యులకు పెద్దపల్లి ఎంపీ లేఖ రాశారు. తెలంగాణ ఆవశ్యకతను ఎంపీ వివేక్ లేఖలో పేర్కొన్నారు. తెలంగాణ పై వాస్తవాలను తెెలిపేందుకే లేఖ రాశానని ఎంపీ తెలిపారు. సీమాంధ్ర ఎంపీలు అందరినీ తప్పుదోవ పట్టిస్తున్నారని చెప్పారు. రాష్ట్రపతి పంపిన బిల్లు అసెంబ్లీలో రిజెక్టయిందని తప్పుడు ప్రచారం చేస్తున్నారని తెలిపారు. 30 సెకన్లలో మూసువాణి ఓటుతో బిల్లును తిరస్కరించి నిబంధనలు ఉల్లంఘించారు. ఆగ్రహం వ్యక్తం చేశారు.




