హైదరాబాద్: పోలవరం ప్రాజెక్టు డిజైన్ మార్చాల్సిందేనని ఖమ్మం జిల్లాకు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ విషయంపై రేపు కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ, ప్రధాన మంత్రి మన్మోహన్‌సింగ్, రాహుల్‌గాంధీ, షిండేలను కలువనున్నట్లు ఆయన చెప్పారు. ఖమ్మం జిల్లాలోని మైనింగ్ పై కన్నెసిన సీమాంధ్రులు పోలవరం ముంపు ప్రాంతాన్ని సీమాంధ్రలో కలపాలని కుట్ర చేస్తున్నారని ఆయన ఆరోపించారు.




