Wednesday, 4 November 2026

ఆ ఆరుగురు ఏంపీల వెలి

సీమంధ్ర ఏంపీలపై కాంగ్రెస్‌ హైకమాండ్‌ కొరడా

న్యూఢిల్లీ: స్వంత ప్రభుత్వంపైనే అవిశ్వాస నోటీసు ఇచ్చి ఓవరాక్షన్‌ చేసిన ఆరుగురు సీమాంధ్ర ఎంపీలపై కాంగ్రెస్‌ హైకమాండ్‌ సీరియస్‌ యాక్షన్‌ తీసుకుంది. పార్టీ నుంచి ఆ ఆరుగురిని బహిష్కరించి కాంగ్రెస్‌ తన సిన్సియారిటీని నిరూపించుకునే ప్రయత్నం చేసింది. ఎంపీలు లగడపాటి రాజగోపాల్‌(విజయవాడ), ఉండవల్లి అరుణ్‌కుమార్‌(రాజమండ్రి), సాయిప్రతాప్‌(రాజంపేట), హర్షకుమార్‌(అమలాపురం). రాయపాటిసాంబశివరావు(గుంటురు), సబ్బం హరి(అనకాపల్లి) లపై కాంగ్రెస్‌ హైకమాండ్‌ చర్చలు తీసుకుంది. క్రమశిక్షణా రహిత్యం కింద వారిపై ఈ చర్యలు తీసుకున్నట్లు ఏఐసీసీ జనాన్ధన్‌ ద్వివేది ప్రకటించారు. ఈ మేరకు మీడియా ప్రకటన విడుతల చేశారు. బహిష్కరణ వేటు తక్షణమే అమలులోకి వస్తుందని ఆయన వెల్లడించారు. గత వారం రోజులుగా ఈ ఆరుగురు లోక్‌సభలో కూడా ఆందోళన చేస్తూ సభకు ఆటంకం కలిగిస్తున్నారు. వీరిని సభనుంచి సైతం సస్పెండ్‌ చేసే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ఈ సందర్భంలో ఆరుగురిపై చర్యలు తీసుకోవడం వల్ల మిగతా సీమాంధ్ర ఎంపీలను దారిలోకి తెచ్చుకోవచ్చనేది కాంగ్రెస్‌ వ్యూహంగా కనిపిస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *