కలకత్తా: కలకత్తాలోని హౌరా స్టేషన్ వద్ద మంగళవారం హౌరా-ఢిల్లీ రాజధాని ఎక్స్‌ప్రెస్‌లో జనరేటర్ వ్యాన్ వద్ద మంటలు రావడంతో దట్టమైన పొగలు వ్యాపించాయి. స్టేషన్‌లో 9వ నంబర్ ఫ్లాట్‌ఫాంపై రైలు ఆగి ఉన్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. అగ్నిమాపక సిబ్బంది ప్రమాదాన్ని నిలువరించారు. సాయంత్రం 4:50కి హౌరా స్టేషన్ నుంచి బయలు దేరాల్సిన ఉండగా రైలు ఇంకా అక్కడే ఉంది. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సిఉంది.




