Wednesday, 4 November 2026

షాపుర్‌నగర్‌లో దారుణం

హైదరాబాద్‌: సొంత కుమార్తెలపై తండ్రి అత్యాచారానికి పాల్పడిన ఘటన నరగంలోని జగద్గిరి ప్రాంతంలో చోటు చేసుకుంది. స్థానికంగా నివాసముంటున్న అమర్‌నాథ్‌ అనే వ్యక్తి తన ఇద్దరు మైనర్‌ కుమార్తెలపై ఏడాది కాలంగా అత్యాచారానికి పాల్పడుతున్నట్లు స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితుడ్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారించగా చేసిన తప్పును ఒప్పుకున్నాడు. ఇద్దరు బాలికలు నిందితుడి మొదటి భార్య కుమార్తెలు. ఈ ఘటనపై జీడి మెట్ల పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *