ఢిల్లీ: తెలంగాణ బిల్లుకు మద్దతు ఇచ్చేందుకు బీజేపీ ఒప్పుకుందని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కమల్‌నాథ్ ప్రకటించారు. తెలంగాణ బిల్లుకు అన్ని అడ్డంకులు తొలగినప్పటికి పార్లమెంటులో బిల్లు ఎప్పుడు ప్రవేశ పెట్టాలన్నది నిర్ణయం తీసుకోవాల్సి ఉందని కమల్‌నాథ్ పేరర్కొన్నారు. బీజేపీ నేతలతో ప్రధాని మన్మోహన్‌సింగ్ విందు భేటీ ముగిసింది.ఈ భేటీలో బీజేపీ తరపున అగ్రనేతలు అద్వానీ, సుష్మాస్వరాజ్, అరుణ్ జైట్లీ, రాజ్‌నాథ్, ప్రభుత్వం తరపున కేంద్రమంత్రులు కమల్‌నాథ్, ఆంటోని, చిదంబరం హాజరయ్యారు.అరగంట పాటు సాగిన ఈ సమావేశంలో పలు బిల్లులు ఆమోదం కోసం తీసుకోవాల్సిన చర్చలపై చర్చించినట్లు తెలుస్తోంది.




