Wednesday, 4 November 2026

టీ బిల్లు పై చర్చ జరగాల్సిందే : బీజేపీ

ఢిల్లీ: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు బిల్లుపై పార్లమెంట్‌లో చర్చ జరగాల్సిందేనని బిజేపీ డిమాండ్‌ చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రధానితో విందు సమావేశాల్లో పాల్గొన్న బీజేపీ అగ్రనేతలు టీ బిల్లుకు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తూనే సీమాంధ్రకు న్యాయం చేయాలని పలు సూచనలు చేసినట్లు సమాచారం. రాయలసీమకు ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాలని, కొత్త రాజధానిని వెంటనే ప్రకటించాలని ప్రధానితో బీజేపీ నేతలు తేల్చిచెప్పినట్లు సమాచారం. మీ మంత్రుల్ని, ఎంపీలను అదుపులో ఉంచుకోవాల్సిన బాధ్యత కాంగ్రెస్‌ పార్టీదేనని వారు ప్రధానికి స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. ఈ సాయంత్రం కేంద్ర కేబినెట్‌ సమావేశామై బీజేపీ సవరణలపై కసరత్తు చేయనున్నట్లు సమాచారం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *