హైదరాబాద్: రాష్ట్రవిభజన పై కేంద్రం ఏకపక్షంగా ముందుకెళ్తోందని ఆరోపిస్తూ తేదేపా ఎమ్మెల్సీ నన్నపనేని రాజకుమారి అసెంబ్లీలోని తెదేపా శాసన సభాపక్ష కార్యాలయం ముఖద్వారం వద్ద నిన్న ఉదయం నిరసన దీక్ష చేపట్టారు. రాజకుమారిని బుధవారం సాయంత్రం పోలీసులు నిమ్స్ ఆసుపత్రికి తరలించారు. హైబీపీతో బాధపడుతున్న ఆమె ఆరోగ్యం క్షీణించడంతో పోలీసులు ఆస్పత్రికి తరలించారు.




