హైదరాబాద్: మున్సిపల్ కార్మక సంఘాలతో మంత్రి మహీధర్‌రెడ్డి చేపట్టిన చర్చలు సఫలమయ్యాయి. జీహెచ్‌ఎంసీ పరిధిలో 27శాతం, మిగతా నగరపాలక సంస్థల్లో 23శాతం, పురపాలక సంఘాల్లో 9 శాతం మధ్యంతర భృతికి ప్రభుత్వం అంగీకరించింది. ఈ మేరకు గ్రేటర్ హైదరాబాద్, విశాఖ, విజయవాడ ఉద్యోగులకు రూ.8500 జీతంతో పాటు ఆలవెన్స్‌లు, మున్సిపాలిటీలోని ఉద్యోగులకు రూ.8,300 నగరపంచాయితీలోని ఉద్యోగాలకు రూ.7300 అందనున్నాయి. తమ డిమాండ్లు ఆశించినమేర సఫలమైనందున సమ్మె విరమించి విధులను హాజరుకానున్నట్లు ఉద్యోగ సంఘాలు తెలిపాయి.




