న్యూఢిల్లీ: తెలంగాణ ఏర్పాటును అడ్డుకునేందుకు సీమాంధ్రనేతలు కుట్రలు పన్నుతూనే ఉన్నారు. హస్తినలో పడరాని పాట్లు పడుతున్నారు. ఈ మేరకు ఇవాళ బీజేపీ జాతీయ అధ్యక్షుడు రాజ్‌నాథ్‌సింగ్‌తో భేటీ కావాలని చంద్రబాబు చేసిన ప్రయత్నం విఫలమైంది. రాజ్‌నాథ్‌ను కలవాలని చంద్రబాబు అపాయింట్‌మెంట్ కోరారు. అందుకు రాజ్‌నాథ్‌సింగ్ తిరస్కకించారు. బీజేపీ నేతలు సుష్మాస్వరాజ్, అద్వానీ తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని వార్తలు వస్తోన్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.




