హైదరాబాద్: కాకినాడ పట్టణంలో ఓ వైద్యవిద్యార్ధిని ఆత్మహత్యకు పాల్పడింది. రాజమండ్రిలోని జీఎస్‌ఎల్ మెడికల్ కాలేజీలో రేడియాలజీ విభాగంలో పీజీ ద్వితీయ సంవత్సరం చదువుతోన్న శ్రీలక్ష్మీ(26) అనే విద్యార్ధిని చున్నీతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కాలేజీ యాజమాన్యం వేధింపులే ఆత్మహత్యకు కారణమని మృతురాలి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. కాకినాడ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తునాఈ్నరు.




