Wednesday, 4 November 2026

ప్రేమికుల రోజు విషాదం

హైదరాబాద్‌ : హైదరాబాద్‌లో ప్రేమికుల రోజు విషాద సంఘటన చోటుచేసుకుంది. ప్రేమికుడి ఇంట్లో గాయపడ్డ ప్రియురాలు మృతిచెందింది. సంఘటన వివరాల్లోకివెళితే ప్రియుడిని నమ్మి పెళ్లి విషయమై మాట్లాడటానికి అతని ఇంటికి వెళ్లింది ఓ.యూ. విద్యార్థి షీలా, ప్రియుడి ఇంట్లో అతని తల్లిదండ్రులతో ఘర్షణ చోటుచేసుకుంది. ఏమైందో తెలియదు కానీ కాలిన శరీరంతో షీలా బయటకు పరుగెత్తుకొచ్చింది. దీన్ని గమనించిన స్థానికులు ఆమెను గాంధీ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించి షీలా మృతిచెందింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రియుడిని, అతడి తల్లిదండ్రులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *