Wednesday, 4 November 2026

అజిత్‌సింగ్‌ను కలిసిన ఎమ్మెల్సీ దిలీప్‌కుమార్‌

ఢిల్లీ : ఆర్‌ఎల్‌డీ అధినేత అజిత్‌సింగ్‌ను ఆ పార్టీ నేత, ఎమ్మెల్సీ దిలీప్‌కుమార్‌ కలిశారు. దిలీప్‌కుమార్‌తోపాటు ఉద్యోగ సంఘ నేతలు గోపాల్‌రెడ్డి, ప్రొఫెసర్‌ లక్ష్మణ్‌లు కలిశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విషయంలో యూపీఏ ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని టీ బిల్లు పార్లమెంట్‌లో ఖచ్చితంగా పాస్‌ అవుతదని అజిత్‌సింగ్‌ పేర్కొన్నారు. టీ బిల్లును వ్యతిరేకించే సాహసం బీజేపీ చేయదని తనను కలిసిన నేతలతో ఈ సందర్భంగా ఆయన అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *