Wednesday, 4 November 2026

పెప్పర్‌ స్ప్రే ప్రయోగం పై స్పీకర్‌ ఆగ్రహం

న్యూఢిల్లీ: నిన్న పార్లమెంట్‌లో సీమాంధ్ర ఎంపీలగడపాటి రాజగోపాల్‌ స్ప్రే ప్రయోగించిన సంఘటనపై స్పీకర్‌ మీరాకుమార్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలు ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు వంటిదని అభివర్ణించారు. మరోసారి ఇలాంటి దుర్ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని పార్లమెంట్‌ అధికారులను ఆదేశించారు. ఈ నెల 17న పార్లమెంట్‌ సెక్యూరిటీపై సమీక్ష నిర్వహించాలని ఆమె డిప్యూటీ స్పీకర్‌ను కోరారు. లోక్‌సభ చాంబర్‌లోకి ప్రాణాంతక, హానికర వస్తువులను తీసుకెళ్లకుండా నిరోధించడం పై పలు సూచనలు చేయాలని విజ్ఞప్తి చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *