న్యూఢిల్లీ : ఏపీలో రెండు ప్రాంతాలు ఇక కలిసుండే పరిస్థితులు లేవని తెంగాణ రాజకీయ జేఏసీ ఛైర్మెన్ ప్రొఫ్రెసర్ కోదండరాం స్పష్టం చేశారు. ఇవాళ ఆయన బీజేపీ నేత సుష్మొస్వరాజ్‌ను కలిసిన అనంతరం మీడియాతో మాట్లాడారు. తెలంగాణకు మద్దతివ్వాలని తాము సుష్మాను కోరామని అందుకు ఆమె తెలంగాణ ఏర్పడి తీరుతుందని హామీ ఇచ్చారని వివరించారు. విభజన అనివార్యమని, ఇక కలిసుండే పరిస్థితులు ఏపీలో లేవని పేర్కొన్నారు. ఇప్పుడు కాదంటే హింస కూడా ప్రజ్వరిల్లే అవకాశం ఉందని తెలిపారు. తెలంగాణ రాకపోతే చట్టసభలపై ప్రజలకు విశ్వాసం పోతుందని వ్యాఖ్యానించారు. ఏప్పుడూ కూడా విరుద్ధ భావాలు కలిగిన రెండు పార్టీల మధ్య ఏకాభిప్రాయం సాధ్యం కాదని తెలిపారు. ఒక మెట్టు దిగైనా సరే రెండు పార్టీలు సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. సీమాంధ్ర నేతలు హింసకు పాల్పడి బిల్లును అడ్డుకోవాలని చూస్తున్నారని కోదండరాం ఆరోపించారు.




