వరంగల్, ఫిబ్రవరి 15(ఎపిఇఎంఎస్): సమక్క-సారలమ్మ జాతరలో అపశృతి దొర్లింది. ఖమ్మం జిల్లాకు చెందిన ఓ యువకుడు జాతరకు వచ్చాడు. దర్శనానికి ముందు స్నానం కోసం జంపనవాగులో దిగాడు. ప్రమాదవశాత్తు అందులో పడి మరణించాడు. శుక్రవారం రాత్రి ఈ ఘటన జరిగింది. జనసమ్మర్ధంలో ఈ యువకుడు చనిపోయిన విషయాన్ని ఎవరూ గుర్తించలేదు. ఆ తర్వాత శవం పైకి తేలడంతో పోలీసులు దాన్ని బయటకు తీశారు.




