Wednesday, 4 November 2026

మోడీకి మద్దతుగా ఆధ్యాత్మిక గురువు రవిశంకర్‌ ప్రచారం

హైదరాబాద్‌, ఫిబ్రవరి 15 : సుస్థిరమైన పాలన అందించే మంచి వ్యక్తిని ప్రధానిగా ఎన్నుకోవాలన్న నినాదంతో బిజెపి ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్రమోడీకి మద్దతుగా ప్రముఖ ఆధ్యాత్మిక గురువు రవిశంకర్‌ శనివారం నుండి రాష్ట్రంలో ప్రచారానికి శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా నేడు ఆయన కాచిగూడ రైల్వేస్టేషన్‌కు చేరుకున్నారు. అక్కడ ఆయనకు బిజెపి జాతీయ ఉపాధ్యక్షులు బండారు దత్తాత్రేయ, రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డితో పాటు పెద్ద ఎత్తున బిజెపి కార్యకర్తలు, నాయకులు చేరుకొని ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు. బిజెపి శ్రేణుల స్వాగతం అనంతరం కొద్దిసేపు వారితో మాట్లాడిన ఆయన అక్కడి నుండి తిరుపతికి బయలుదేరి వెళ్లారు. మార్గమధ్యలో నల్గొండలో ఆగి సత్సంగ్‌ నిర్వహించి దేశ సంస్కృతి, సాంప్రదాయాలు చరిత్ర గూర్చి వివరిస్తూ అవినీతి కుంభకోణాల్లో మునిగిపోయిన భారతదేశ ప్రతిష్టను కాపాడడానికి సరైన నేత నరేంద్రమోడీ అని, ఆయనను భావిప్రధానిగా ఎన్నుకోవాలని ఐదు రోజుల పాటు పర్యటించి ప్రజల్లో చైతన్యం చేయనున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *