Wednesday, 4 November 2026

జనంలోంచి వనంలోకి


వరంగల్‌, ఫిబ్రవరి 15 (జనంసాక్షి) :
ఆదివాసీల దేవతలు సమ్మక్క సారలమ్మ భక్తజ నం మధ్య నుంచి తిరిగి వన ప్రవేశం చేశారు. నాలుగు రోజుల పాటు జరిగిన మే డారం జా తర శనివారం సాయంత్రం ఘనం గా ముగిసింది. సమ్మక్క, సారలమ్మల వన ప్రవేశంలో జాతరలో కీలకఘట్టం ముగిసిట ్లయింది. కోయ, వ్డడెర పూజారులు గిరిజన సంప్రదాయ పద్దతిలో పూజలు నిర్వహించి అమ్మవార్లను వనప్రవేశం చేయించారు. సమ్మక్కను చిలుకలగుట్ట, సారలమ్మను కన్నె పల్లి, గోవిందరాజును కొండాయి, పగిడిద్ద రాజును పునుగొండ్లకు
చేర్చారు. దీంతో జా తర తంతు ముగిసింది. కొద్ది రోజులుగా జనారణ్యంగా ఉన్న మేడారం, జాతర ముగుస్తుండటంతో క్రమంగా అభయారణ్యంగా మారుతోంది. వరంగల్‌ జిల్లా మేడారంలో జరుగుతోన్న సమ్మక్క-సారలమ్మ జాతర ముగిసింది. ఈమేరకు దీనికి సంబంధించిన తంతును గిరిజన, కోయ పూజారులు నిర్వహించారు. సంప్రదాయం ప్రకారం అమ్మవార్లను వన ప్రవేశం చేయించారు. జాతర విజయవంతమైందని జిల్లా కలెక్టర్‌ జిల్లా కలెక్టర్‌ కిషన్‌, ఎస్పీ కాళిదాసు ప్రకటించారు. కొన్ని సమస్యలు ఎదురైనా దర్శనంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగలేదని తెలిపారు. సుమారు కోటిమందికి పైగా భక్తులు అమ్మవార్లను దర్శించుకున్నట్లు వెల్లడించారు. కొద్దిరోజులుగా జనారణ్యంగా ఉన్న మేడారం.. జాతర ముగింపుతో మళ్లీ కీకారణ్యంగా మారనుంది. సమ్మక్కను చిలకలగుట్ట, సారలమ్మను కన్నెపల్లి, గోవిందరాజును కొండాయి, పగిడిద్ద రాజను పునుగొండ్లకు చేర్చడంతో జాతర ముగిసిందని జిల్లా కలెక్టర్‌ కిషన్‌ ప్రకటించారు. జాతర చివరి రోజు కావడంతో వనదేవతలను దర్శించుకోవడానికి శనివారం భక్తులు బారులు తీరారు. మూడు రోజులుగా మొక్కులు అందుకున్న వన దేవతలు వనప్రవేశం చేయడంతో రెండేల్ల జాతర ముగసింది. మళ్లీ 2016 ఫిబ్రవరిలో జాతర జరుగనుంది. గద్దెలపై సమ్మక్క, సారలమ్మ, గోవిందరాజు, పగిడిద్దరాజు కొలువైన మహాఘట్టాన్ని చూసేందుకు భక్తజనం ఉత్సాహం చూపారు. భక్తుల జయజయ ధ్వానాలతో మేడారం కిక్కిరిసింది. రహదారులన్నీ నిండిపోయాయి. శుక్రవారం మొక్కుల దినం కావడంతో భక్తులు లక్షల సంఖ్యలో పోటెత్తారు. జంపన్న వాగులో పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు అమ్మవార్లకు మొక్కులు చెల్లించుకున్నారు. గద్దెల వద్దకు భక్తులు ఒక్కసారిగా రావడంతో తోపులాట చోటుచేసుకుంది. క్యూలైన్ల నిర్వహణ సరిగా లేకపోవడంతో మహిళా భక్తులు ఇబ్బందులు పడ్డారు. ఒక దశలో గద్దెల వద్ద భక్తులను అదుపు చేయలేక పోలీసులు చేతులెత్తేశారు. మరికొందరు భక్తులు సర్వదర్శనం బారికేడ్లను తొలగించి విఐపి దర్శనం క్యూలైన్ల వైపు వెళ్లారు. సాధారణ భక్తుల నిరసనతో విఐపి, ప్రత్యేక దర్శనాలను అధికారులు నిలిపివేశారు. గద్దెలపై ఉన్న అమ్మవార్లలను దర్శించుకోవడానికి ప్రముఖులు హాజరయ్యారు. గిరిజన సంక్షేమశాఖమంత్రి బాలరాజు, ఉద్యాన శాఖ మంత్రి రాంరెడ్డి వెంకటరెడ్డి, ప్రభుత్వ చీప్‌విఫ్‌ గండ్ర వెంకటరమణారెడ్డి, ములుగు ఎమ్మెల్యే సీతక్క, తదితరులు దర్శించుకున్న వారిలో ఉన్నారు. ఈ సారి కోటిమందికి పైగా భక్తులు మేడారాం వచ్చినట్లు- అధికారులు వెల్లడించారు. చిన్నచిన్న విషయాలు తప్పితే ఎలాంటి అవాంఛీనయ ఘటనలు జరగలేదని కలెకట్ర్‌ కిసన్‌ తెలిపారు. జజాతర విజయవంతం అయినందుకు ఆయన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతులు తెలిపారు. జాతర అనంతరం పదహారు రోజులకు బుధ, గురువారాల్లో తిరుగువారం పండుగ ఘనంగా నిర్వహిస్తారు. మహా జాతరకు రాని భక్తులు ఈ పండుగలో దేవతలను దర్శించుకొని మొక్కులు చెల్లించుకుంటారు. అయితే తిరుగు వారానికీ ఓ కథనం ప్రచారంలో ఉంది. విూ ఆజ్ఞ ప్రకారం జాతర నిర్వహించామని, ఒక్కసారి సంపూర్ణ దర్శనం ఇవ్వండని పూజారులు మరోసారి అమ్మవార్లను వేడుకుంటారని తెలుస్తోంది. ఇక నుంచి జాతర అనంతరం రెండువారాలకు తిరుగు వారం పండుగను నిర్వహించి పూజలు చేయాలని, అప్పుడు భక్తుల కోరికలు తీరుస్తామని, అదృశ్య రూపంలో తాము గ్దదెలపై ఉంటామని సమ్మక్క సారక్క వారికి కలలో వచ్చి చెప్పారని ప్రచారంలో ఉంది. అప్పటి నుంచే తల్లులకు తిరుగు వారం పండుగను నిర్వహిస్తున్నారని అంటారు. తిరుగువారం పండగను కూడా ఘనంగానే నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఇదిలావుంటే రామప్ప దేవాలయంతో పాటు ఇతర చారిత్రక ప్రదేశాలకు మేడారం వెళ్లి తిరుగు ప్రయాణమవుతున్న భక్తుల తాకిడి పెరిగింది. ఆయా ప్రాంతాలరు అధిక సంఖ్యలో రావడంతో సందడి నెలకొంది. రామప్పతలో దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బారికెడ్లు నిండిపోవడంతో దారిపొడవునా దర్శనానికి నిల్చున్నారు. కొబ్బరికాయలు కొట్టడానికి సరైన ఏర్పాట్లు చేయకపోవడంతో ఇబ్బంది పడ్డారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *