Wednesday, 4 November 2026

లోక్‌సభే లక్ష్యం


అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకుంటున్న ఆమ్‌ ఆద్మీ
పార్లమెంట్‌ పోటీకి నేను సిద్ధం : కేజ్రీవాల్‌
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 15 (జనంసాక్షి) :
లోక్‌సభ ఎన్నికలకు సన్నద్ధమవుత్నుట్టు ఆమ్‌ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్‌ కేజ్రీవాల్‌ ప్రకటించారు. ఢిల్లీ ముఖ్య మంత్రి పదవికి రాజీనామా చేశాక ఆయ న ఆప్‌ వ్యవ హారాలపై శనివారం సుదీర్ఘంగా చర్చిం చారు. శాసన సభలో జన్‌లోక్‌పాల్‌పై కనీసం చర్చ కూడా జరుగక పోవడంతో తాను రాజీనామా చేశా నని పేర్కొన్నారు. ఢిల్లీలో తక్షణమే ఎన్నికలు జరపా లని ఆమ్‌ ఆద్మీ చేసిన డి మాండ్‌ను లెఫ్టినెంట్‌ గవర్న ర్‌ పట్టించుకోలేదని పేర్కొ న్నారు. కాగా, ఢిల్లీలో రాష్ట్రపతి పాలనను పెడుతూ లెఫ్టి నెంట్‌ గవర్నర్‌ నివేదిక ఇవ్వడంపై కాంగ్రెస్‌ పార్టీ హర్షం వ్యక్తం చేసింది. మరోవైపు వచ్చే
సార్వత్రిక ఎన్నికలకు ఆమ్‌ఆద్మీ పార్టీ సమాయత్తమవుతోంది. అవినీతే ప్రచారాస్త్రంగా దేశవ్యాప్త ప్రచారానికి ప్రణాళికలు రచిస్తోంది. దీనిలో భాగంగా ఆ పార్టీ కన్వీనర్‌ అరవింద్‌ కేజీవ్రాల్‌ ప్రచారం ప్రారంభించనున్నారు. ఈ నెల 23న హర్యానాలో ర్యాలీ ద్వారా దేశవ్యాప్త ప్రచారానికి ఆమ్‌ఆద్మీ పార్టీ శ్రీకారం చుట్టనుంది. ఇదిలావుంటే ఇప్పటికే ఇమేజ్‌ బిల్డప్‌ చేసుకున్న కేజ్రీవాల్‌ ఇప్పుడు ఇక ఎన్నికలు లక్ష్యంగా ప్రజల్లోకి వెళ్లాలనుకుంటున్నట్లు అర్థం అవుతోంది. అందుకే ఆయన సంచలనాత్మకమైన నిర్ణయాలు తీసుకున్నారు. ఇదిలావుంటే ఢిల్లీలో అరవింద్‌ కేజ్రీవాల్‌ ప్రభుత్వం దిగిపోవడానికి పూర్తి బాధ్యత బిజెపి కాంగ్రెస్‌ పార్టీలదే అని ఆప్‌ నేత ప్రశాంత్‌ భూషణ్‌ పేర్కొన్నారు. ఢిల్లీలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. జన్‌లోక్‌పాల్‌పై తమ పోరాటాన్ని విరమించే ప్రసక్తే లేదని ఆయన స్పష్టంచేశారు. మొదటి నుంచి ఈ రెండు పార్టీలు జన్‌లోక్‌పాల్‌ బిల్లును వ్యతిరేకిస్తున్నాయని అందుకే ఆప్‌కు మద్దతు ఇవ్వలేదని అన్నారు. వారికి దేశం అవినీతి రహితంగా ఉండడం ఇష్టంలేదని విమర్శించారు. అధికారం కోసం పార్టీ పెట్టలేదని, అవినీతిని అంతమొందించడమే మా లక్ష్యమని ఆయన ఈ సందర్భంగా స్పష్టంచేశారు. జన్‌లోక్‌పాల్‌ బిల్లును ఆమోదించడమే ఆప్‌ ప్రధాన లక్ష్యమని, బిల్లు ప్రవేశపెట్టడమే కుదరనప్పుడు ఇక అధికారంలో ఉండడంలో అర్థం లేదని అందుకే రాజీనామా నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. రిలయెన్స్‌ అధినేత ముకేష్‌ అంబానీతో ఢీకొని దేశంలో కార్పొరేట్‌ దిగ్గజాలు రాజకీయాలను ఎలా శాసిస్తున్నాయన్న చర్చకు తెరలేపారు. దేశ ఆర్థిక వ్యవస్థనే ప్రభావితం చేసే కేజీ.బేసిన్‌లోనే పాగా వేసిన కార్పొరేట్‌ కంపెనీ. అలాంటి కంపెనీ అధినేత ముకేష్‌ అంబానీని ముక్కుసూటిగా వెళ్లే కేజ్రీవాల్‌ ఢీకొన్నారు. లాబీయింగ్‌తో సహజ సంపదను గుప్పిట్లో పెట్టుకున్న రిలయెన్స్‌ కోరలను పీకేయడానికి ప్రయత్నించారు. అదే తన ప్రభుత్వాన్ని పడేసే పరిస్థితికి తెచ్చిందని కేజీవ్రాల్‌ ఆరోపిస్తున్నారు. ఢిల్లీ ఏసీబీకి రిలయెన్స్‌ గ్యాస్‌ ఉత్పత్తిపై అవినీతి ఆరోపణల ఫిర్యాదులొచ్చాయని, దీనిపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేస్తున్నట్లు కేజీవ్రాల్‌ ప్రకటించారు. ఈ ప్రకటన కార్పొరేట్‌ లాబీయింగ్‌ను కేక పుట్టించింది. కేజ్రీవాల్‌ ప్రకటించడమే కాదు చేసి చూపించారు. రిలయెన్స్‌ అధినేత ముకేష్‌ అంబానీని నేరుగా ఎఫ్‌ఐఆర్‌లోకి లాగారు. కేజీబేసిన్‌ ఒప్పందం చేసిన కేంద్ర మాజీ మంత్రి మురళీ దేవరాను, వారికి రేటు పెంచడంలో ముఖ్యపాత్ర పోషించిన ప్రస్తుత పెట్రోలియం శాఖా మంత్రి వీరప్పమొయిలీలతో పాటు మరో అధికారిపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. కేంద్ర మంత్రులపైనే ఎఫ్‌ఐఆర్‌ పెట్టడంతో న్యాయనిపుణుల బుర్రలు వేడెక్కాయి. ఒక రాష్ట్ర ప్రభుత్వం ఇలా చేయొచ్చా చేయకూడదా అనే చర్చ జరిగింది. జనలోక్‌పాల్‌ బిల్లును ప్రతిపక్షాలు అడ్డుకుంటాయని కేజీవ్రాల్‌కే ముందే తెలుసని కాంగ్రెస్‌, బిజెపిల అవినీతిని ఫోకస్‌ చేయడానికే అంబానీని సీన్‌లోకి లాగారని కొందరంటున్నారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలపై ప్రధాన పార్టీలైన కాంగ్రెస్‌, బిజెపిలపై రిలయెన్స్‌ ప్రభావం అందరికీ తెలిసిందేనని ఇదే విషయాన్ని బయటపెట్టి వారిని దోషులుగా నిలబెట్టడానికే కేజీవ్రాల్‌ ఈ వ్యూహం పన్నారని అంటున్నారు. మొత్తంమీద లోక్‌సభ ఎన్నికలు రానున్న నేపథ్యంలో అంబానీని ఢీకొట్టడం ద్వారా దేశవ్యాప్తంగా ఆమ్‌ఆద్మీపై దృష్టి పెంచడానికి కేజీవ్రాల్‌ ప్రయత్నిస్తున్నట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అవినీతి వ్యతిరేక పోరాటంలో రిలయెన్స్‌ ఎపిసోడ్‌ హైలెట్‌ అవుతుందని ఆమ్‌ ఆద్మీ భావిస్తున్నట్లు వారు అభిప్రాయపడుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *