ఢిల్లీ : పార్లమెంటులో టీ బిల్లును అడ్డుకుంటామని వైసీపీ నేత జగన్ అన్నారు. సీపీఎం జాతీయ నేత ప్రకాశ్ కారత్‌తో జగన్ భేటీ అయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ – కేంద్రం అప్రజాస్వామికంగా వ్యవహరిస్తుందని పేర్కొన్నారు. తెలంగాణ ఏర్పాటు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు.




