Wednesday, 4 November 2026

అప్రమత్తమైన కేంద్ర ఇంటెలిజెన్స్‌

న్యూఢిల్లీ : ఆంధ్రప్రదేశ్‌ నుంచి ఢిల్లీ వెళ్తున్న సమైక్యవాదులపై కేంద్ర ఇంటెలిజెన్స్‌ వర్గాలు ప్రత్యేక దృష్టి సారించాయి. ఢిల్లీలో విధ్వంసం సృష్టించడానికి వస్తున్నారన్న పక్కా సమాచారంతో కేంద్ర ఇంటెలిజెన్స్‌ వర్గాలు అప్రమత్తమయ్యాయి. పక్క రాష్ట్రాల్లో ఉన్న పోలీసు అధికారుల సహాయంతో వారిని ఢిల్లీ రాకుండా అడ్డుకునేందుకు యత్నిస్తున్నారు. ఢిల్లీకి వస్తే కచ్చితంగా విధ్వంసం జరగొచ్చనే సమాచారంతోనే ఈ చర్యలు చేపట్టారు. అవసరమైతే ఢిల్లీ రాకుండా పక్క రాష్ట్రాల్లో రైళ్లు ఆపే అవకాశం ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *