Wednesday, 4 November 2026

ఆత్మహత్యలు చేసుకోకండి : స్వామీ అగ్నివేష్‌

న్యూఢిల్లీ : పార్లమెంట్‌లో సీమాంధ్రుల తీరుపై స్వామీ అగ్నివేష్‌ మండిపడ్డారు. లగడపాటి, మోదుగుల వ్యవహరించిన తీరు చట్ట సభలను అవమానపర్చే విధంగా ఉందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. వాళ్లను శాశ్వతంగా ఎన్నికల్లో పోటీ చేయకుండా చూడాలని స్పీకర్‌కు విజ్ఞప్తి చేశారు. తెలంగాణను అడ్డుకోవడం ఎవరి తరం కాదని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాన బిల్లుపై బీజేపీ, కాంగ్రెస్‌ విమర్శలు చేసుకుంటున్నాయని, లిక్కర్‌ మాఫియా, భూ మాఫియా తెలంగాణను అడ్డుకోలేరని తెలిపారు. వారంలో తెలంగాణ రాష్ట్రం కళ సాకారం కాబోతుందని పేర్కొన్నారు. ఈ తరుణంలో విద్యార్ధులు, యువకులు ఎవరూ ఆత్మహత్య చేసుకోవద్దని అగ్నివేష్‌ విజ్ఞప్తి చేశారు. రాబోయే తెలంగాణ మీ జీవితాలను మార్చబోతుంది దయచేసి ఆత్మహత్యలు చేసుకోకండని కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *