న్యూఢిల్లీ : 18వ తేదీన లోక్‌సభలో, 19న రాజ్యసభలో తెలంగాణ బిల్లు పాస్ అవుతుందని ఎంపీ పాల్వాయి గోవర్ధన్ తెలిపారు. ప్రభుత్వ కార్యదర్శులను హెచ్చరిస్తున్నా…. సీఎం కిరణ్ మాటలు విని తప్పులు చేస్తే మీరు కూడా జైలుకు వెళ్లక తప్పదని పేర్కొన్నారు. సీఎం కిరణ్ భూపందేరాలు చెల్లవని, ఆ భూములు కొంటే డబ్బులు పోతాయని చెప్పారు. సీఎం కిరణ్ అవినీతిపై కేసులు పెట్టి జైళ్లో పడేస్తామని తెలిపారు.




