హైదరాబాద్ : సీమాంధ్రుల ధర్నాకు రాంలీలా మైదాన్‌లో భారీగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. కోట్ల రూపాయలను ఏపీ ఎన్టీవోలు నీళ్లలా ఖర్చు చేస్తున్నారు. ఆరు రైళ్లలో ఏపీ ఎన్టీవోలు ఢిల్లీకి వెళ్లిన సంగతి తెలిసిందే. 15 వేల మందికి వసతి, భోజనాలకు భారీగా ఖర్చు చేస్తున్నారు.
ఏపీ ఎన్టీవోల నేతృత్వంలో సీమాంధ్ర నేతలు ఖర్చు చేస్తున్నట్లు సమాచారం. రాంలీలా మైదాన్‌ను ఏపీఎన్టీవోలు లగ్జరీ ¬టల్‌గా మార్చేశారు. మైదానంలో హీటర్లు, పరుపులతో లగ్జరీ ఏర్పాట్లు చేస్తున్నారు.
రేపు ఎల్లుండి సమైక్యవాదుల ఆందోళన ఉన్న సంగతి తెలిసిందే. అవసరమైతే పార్లమెంట్‌ను ముట్టడిస్తామని ఏపీఎన్టీవోలు ప్రకటనలు చేస్తున్నారు. రాంలీలా మైదాన్‌కు పార్లమెంట్‌కు తొమ్మిది కిలోమీటర్ల దూరం ఉంటుంది.
మరోవైపు జంతర్‌మంతర్ వద్ద జగన్ దీక్ష చేస్తున్నాడు. రెండు రైళ్లలో ఢిల్లీకి వైసీపీ కార్యకర్తలు బయలుదేరిన సంగతి తెలిసిందే. తెలంగాణను అడ్డుకోవడానికే సీమ రౌడీలు ఢిల్లీ వచ్చారని తెలంగాణవాదులు ఆరోపిస్తున్నారు. రచ్చ చేయడానికే ఢిల్లీ వచ్చారని విమర్శించారు. పార్లమెంట్‌లో పెప్పర్‌స్ప్రేతో సీమాంధ్ర నేతలు రౌడీయిజం చూపించిన సంగతి తెలిసిందే.
ఈ భారీ ఖర్చుకు డబ్బులు ఎక్కడి నుండి వచ్చాయని తెలంగాణవాదులు ప్రశ్నిస్తున్నారు. జాతీయపార్టీలు, ప్రాంతీయపార్టీలు కూడా ఎప్పుడు ఇంత ఖర్చు చేయలేదని తెలిసింది.




