న్యూఢిల్లీ: రాష్ట్ర విభజనను ఆపాలని డిమాండ్ చేస్తూ పార్లమెంట్ ముట్టడికి వెళ్లిన వైసీపీ అధినేత వైఎస్ జగన్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఇవాళ ఆయన జంతర్‌మంతర్ వద్ద ధర్నా నిర్వహించిన అనంతరం పార్లమెంటును ముట్టడిద్దామని ఆపార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. కార్యకర్తలతో కలిసి పార్లమెంట్ వైపుకు వెళ్తుండగా జగన్‌తో పాటు కార్యకర్తలను అరెస్టు చేశారు.




