హైదరాబాద్ : ఓయూ క్యాంపస్‌లో సంబురాలు మిన్నంటాయి. ఇవాళ పార్లమెంట్‌లో తెలంగాణ బిల్లు ఆమోదం పొందిన వెంటనే విద్యార్ధులు ఆర్ట్స్ కాలేజీ వద్దకు చేరుకున్నారు. కేరింతలు కొడుతూ జైతెలంగాణ నినాదాలతో క్యాంపస్ ప్రాంగణాన్ని ¬రెత్తించారు. ఒకరికొకరు ఆలింగనం చేసుకుంటూ ఆనందోత్సాహాలతో గంతులేశారు.




