న్యూఢిల్లీ : తెలంగాణ బిల్లు లోక్సభలో ఆమోదం పొందిన సందర్భంగా తెలంగాణ ప్రజలకు తెలంగాణ రాజకీయ జేఏసీ ఛైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం కృతజ్ఞతలు తెలిపారు. ఇవాళ ఆయన విలేకరులతో మాట్లాడారు. ఇది ప్రజావిజయం, ఈ విజయాన్ని తెలంగాణ అమరవీరులకు అంకితం చేస్తున్నామన్నారు. తెలుగు ప్రజలం ప్రాంతాలుగా విడిపోతున్నామే కానీ సోదరులుగా కాదని ఆయన వ్యాఖ్యానించారు. సీమాంధ్రతో తెలంగాణ ప్రాంతం సన్నిహిత సంబంధాలను కొనసాగిస్తుందని పేర్కొన్నారు.




